– ఎన్నికల వేళ.. బీఆర్ఎస్కు మరో షాక్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అమిత్ రెడ్డికి కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.