Homeహైదరాబాద్latest Newsహఫీజ్ పేట్ డివిజన్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం: డివిజన్ అధ్యక్షులు బాలింగ్...

హఫీజ్ పేట్ డివిజన్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం: డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్

ఇదేనిజం, శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. హఫీజ్ పేట్ 109 డివిజన్ లోని రామకృష్ణ నగర్ కాలనీ లో చేపడుతున్న రోడ్ మరమ్మత్తు, విస్తరణ పనులను నాయకులు వాలా హరీష్ రావు, కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ ..శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అధ్వర్యంలో ఎంతో అభివృద్ధి సాధించినదన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ సహకారంతో హఫీజ్ పేట్ డివిజన్ లో మెరుగైన మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img