Homeహైదరాబాద్latest Newsహరిత ప్రాంగణంగా హనుమకొండ కలెక్టరేట్

హరిత ప్రాంగణంగా హనుమకొండ కలెక్టరేట్

– జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఇదేనిజం, వరంగల్ ప్రతినిధి : హనుమకొండ జిల్లా కలెక్టరేట్​ కార్యాలయం హరిత ప్రాంగణంగా రూపుదిద్దుకుంటుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ వివిధ రకాల పూల మొక్కలతో పాటు, ఆకర్షణీయమైన మొక్కలను ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ పదివేల మొక్కలను నాటి హరిత ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. నాటిన మొక్కల సంరక్షణకు ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు ఎప్పుడు పచ్ఛదనంతో కళకళలాడే విధంగా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, మహేందర్, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీఆర్​వో గణేశ్​, డీఆర్డీవో శ్రీనివాస్​కుమార్, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img