టాలీవుడ్ యంగ్ హీరో, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో గతంలో వచ్చిన ‘జాంబి రెడ్డి’మూవీ మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి కాంబోలో ఏడాది కాలంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవెటెడ్ మూవీ ‘హనుమాన్’. టీజర్‌తో ఓ రేంజ్లో హైప్ తెచ్చుకున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. టీజర్లో ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్స్‌ను ఆడియెన్స్‌ను బాగా ఇంప్రెస్ చేశారు.రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న హనుమాన్ మూవీ ట్రైలర్‌పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. డిసెంబ్ 1న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు టాక్. దీనిపై అఫిషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది.