HomeతెలంగాణHappy Birthday NBK: బాల‌కృష్ణ బర్త్‌డే స్పెషల్.. నందమూరి వారసుడిగా అడుగుపెట్టి నటసింహంగా..

Happy Birthday NBK: బాల‌కృష్ణ బర్త్‌డే స్పెషల్.. నందమూరి వారసుడిగా అడుగుపెట్టి నటసింహంగా..

నందమూరి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన అభిమానులందరూ బాలయ్య, ఎన్‌బికె అని పిలుచుకుంటారు. ఓ వైపు హీరోగా, మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలు సాధించాడు. 100కు పైగా చిత్రాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు. 1960 జూన్ 10న నందమూరి బాలయ్య జన్మించారు. సీనియర్ ఎన్‌టీఆర్, బసవతారకం దంపతులకు జన్మించారు. ఆయన పుట్టడం, పెరగడం అంతా మద్రాసులోనే జరిగింది. బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు. తండ్రి పెద్ద హీరో కావడంతో చిన్నప్పటి నుంచే బాలకృష్ణకు సినీ పరిశ్రమను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది. 1974లో ఎన్‌టీఆర్ దర్శకత్వం వహించిన ‘తాతమ్మ కల’ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటిసారి వెండితెరపై కనిపించారు. ఇక 1980లో బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లను అందుకున్నారు. ‘సాహసమే జీవితం’, ‘మంగమ్మగారి మనవడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాలు ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Recent

- Advertisment -spot_img