భారతీయ సినీ చరిత్రను పరిశీలిస్తే ఫ్లాప్‌లు లేని దిగ్గజ దర్శకులు లేరు. కానీ ఒకే ఒక్క దర్శకుడు అందుకు మినహాయింపు. ఆయనే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2001లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం నుంచి నేటి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి కెరీర్లో ఫ్లాప్ అన్నదే లేదు. ప్రతి మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టరే. బాహుబలి తర్వాత రాజమౌళి పరిధి దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది.
ఇక ఆర్ఆర్ఆర్తో రెండు ఆస్కార్ అవార్డులను సాధించడంతో ఆయన కీర్తి మరింతగా పెరిగింది. మంగళవారం రాజమౌళి బర్త్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ‘మీతో గడిపిన సమయం నిజంగా అపురూపం’ అంటూ రామ్‌చరణ్ ట్వీటర్లో పేర్కొన్నాడు. హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారూ అంటూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టిల్స్ ను కూడా పంచుకున్నారు.
Read More:
భారీ రేటుకు Guntur Karam థియేట్రికల్ రైట్స్..!
http://idenijam.com/guntur-karam-theatrical-rights-at-a-huge-rate/