Easter Wishes : రాష్ట్రవ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. బంధు మిత్రులతో కలిసి ఒకరినొకరు ఆనందంగా Happy Easter అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని కల్వరి టెంపుల్, రాక్ చర్చ్, వెస్లీ చర్చ్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం జల్లాల్లోని పలు చర్చిలు భక్తులతో కిటకిటలాడాయి. యేసు క్రీస్తు పునరుత్థానాన్ని (మరణించి తిరిగి లేవడం) పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఇదేనిజం వెబ్‌సైట్ (Idenijam.com) తరఫున క్రైస్తవులందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.