HomeతెలంగాణHappy Father's Day 2024: నాన్నే నా తొలి హీరో.. ఫాదర్స్‌డే జరగడానికి ఓ అమ్మాయి...

Happy Father’s Day 2024: నాన్నే నా తొలి హీరో.. ఫాదర్స్‌డే జరగడానికి ఓ అమ్మాయి కారణమని మీకు తెలుసా..? ఆమె ఎవరు అంటే..?

Happy Father’s Day 2024: మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న. తల్లి మాటలతో ధైర్యం చెబితే నాన్న చేతలతో మనలో ధైర్యం నింపుతాడు. మన మొదటి గురువు, తొలి స్నేహితుడూ నాన్నే. మనల్ని తీర్చిదిద్ది. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తూ నాన్న ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. ప్రతి కొడుకు. కూతురు జీవితాల్లో నిజమైన హీరో నాన్నే. నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం.
అయితే మొట్టమొదటగా తండ్రుల దినోత్సవాన్ని 1910లో జూన్‌ 19న యూఎస్‌లో జరుపుకొన్నారు. సొనోరా స్మార్ట్‌ డాడ్‌ అనే అమ్మాయి తండ్రి సైనికుడు. తల్లి చిన్నప్పుడే చనిపోతే.. ఆరుగురు బిడ్డలనూ కంటికిరెప్పలా కాచుకుని పెంచి పెద్దచేశాడట. అందుకే, తమకోసం కష్టపడ్డ నాన్నకోసం సొనోరా ఏమైనా చేయాలనుకునేదట. అప్పుడే అనా జార్విస్‌ మాతృదినోత్సవాన్ని జరుపుతున్న విషయం తెలుసుకుంది. తండ్రి స్థానంలో ఉండి బాగోగులు చూసుకున్న మగవాళ్ల గౌరవార్థం తాను ఫాదర్స్‌డే జరపాలని నిర్ణయించుకుంది.

Recent

- Advertisment -spot_img