Homeహైదరాబాద్latest Newsహ్యాపీ శనివారం బ్రదర్

హ్యాపీ శనివారం బ్రదర్

టాలీవుడ్ హీరో నాని న‌టిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ . నాని 31గా వ‌స్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తుండ‌గా.. ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే నేడు నాని పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా ‘సరిపోదా శనివారం’ మేక‌ర్స్ నానికి విషెస్ తెలుపుతూ.. గ్లింప్స్ విడుద‌ల చేశారు. ”కోపాలు ర‌క‌ర‌కాలు. ఒక్కో మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకుని ఎవరైనా చూశారా.. నేను చూశా అంటూ గ్లింప్స్ సాగింది. ఇక ఈ వీడియో చూస్తుంటే.. సూర్య పాత్రలో నాని క‌నిపిస్తుండ‌గా.. తన కోపాన్ని మొత్తం కేవలం శనివారమే మాత్ర‌మే చూపిస్తాడు. అయితే శనివారం మాత్రమే నానికి కోపం ఎందుకు వస్తుంది? మిగతా రోజులు నార్మల్ గా ఎందుకు రియాక్ట్ అవుతాడు? అనేది తెలియాలంటే సినిమా వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. చూస్తుంటే నాని ఈ సారి యాక్షన్ మోడ్ లో బీభత్సం సృష్టించబోతున్నట్లు తెలుస్తుంది. చివరి షాట్ లో ఎస్‌జే సూర్య పోలీస్ గెటప్ లో ఒక విధమైన వెటకారంతో బర్త్ డే విషెష్ చెప్పడం గ్లింప్స్ కే హైలెట్ గా నిలిచింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ సినిమా తర్వాత నాని – వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img