Homeహైదరాబాద్latest Newsప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు.. యోగా వలన మానసిక ప్రశాంతత: యోగ మాస్టర్ రాంబాబు

ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు.. యోగా వలన మానసిక ప్రశాంతత: యోగ మాస్టర్ రాంబాబు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో మార్నింగ్ వాకర్స్ అందరూ కలిసి యోగ డే జరుపుకోవడం జరిగింది. యోగ మాస్టర్ రాంబాబు సూచనల మేరకు యోగాసనాలు వేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. యోగా వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని కావున ప్రతి ఒక్కరు యోగని దయనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాసమల్ల నాగయ్య, అనిల్,వనం శ్రీనివాసులు, యాదయ్య, పండరినాథ్, నాగేశ్వరరావు,శంకర్,ఎల్ ఐ సి శ్రీనివాస్ చారి, కరాటే మాస్టర్ చైతన్య, సుభాని,లింగం టీచర్,నాగార్జున,హరి ప్రసాద్, శేఖర్, సెట్ సైది రెడ్డి,వినోద్ టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img