Homeహైదరాబాద్latest Newsవయోవృద్ధులని వేధిస్తే 3 నెలల జైలు శిక్ష

వయోవృద్ధులని వేధిస్తే 3 నెలల జైలు శిక్ష

ఇదే నిజం, మెట్ పల్లి : వయో వృద్ధులైన తల్లిదండ్రులను వేధిస్తే 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటిజన్స్ పిలుపు, వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను ఆర్డీవో శ్రీనివాస్ గురువారం ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వయో వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పూర్తిగా పిల్లలదే అని స్పష్టం చేశారు. వృద్ధులను వేధించే పిల్లలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 2007 వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వేధింపులకు గురవుతున్న వయోవృద్ధులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డివిజన్ అధ్యక్షులు ఒజ్జెల బుచ్చిరెడ్డి, కార్యదర్శి చౌడాల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img