Homeలైఫ్‌స్టైల్‌రెండో వేవ్‌ చాలా తేడా

రెండో వేవ్‌ చాలా తేడా

కరోనా మొదటి వేవ్‌కు.. రెండో వేవ్‌కు చాలా తేడా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మొదటి వేవ్‌లో 20 శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారని, రెండో వేవ్‌లో 95 శాతం మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.

బుధవారం నగరంలోని గచ్చిబౌలి టిమ్స్‌, సికింద్రాబాద్ గాంధీ దవాఖాన, కింగ్‌కోఠి దవాఖానలను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

దవాఖానల్లో మొత్తం 47 వేల పడకల్లో సగానికిపైగా కొవిడ్‌ రోగుల చికిత్సకు వినియోగిస్తున్నామని వెల్లడించారు. సీరియస్‌ కేసులు వస్తే ప్రైవేట్‌ ఆసుపత్రులు గాంధీ దవాఖానకు పంపుతున్నాయి.

ఈ సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని మంత్రి సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

Recent

- Advertisment -spot_img