Homeహైదరాబాద్latest Newsఐటీ రిటర్న్స్ ఫైల్ చేసారా?

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసారా?

IT Returns : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారు ప్రతిఏటా తప్పనిసరిగా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ ఐటీఆర్ 1,2,4,6 వంటి ఫామ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT). తొలి రోజే 23 వేలకుపైగా ఐటీఆర్స్ ఫైలింగ్ జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ సీజన్ ప్రారంభమైందని తెలుస్తోంది. గడువు ఉంది కదా అని అలసత్వం వహించకుండా ముందుగానే ఫైల్ చేయడం ద్వారా ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img