Homeఫ్లాష్ ఫ్లాష్HBD Sourav Ganguly: హ్యాపీ బర్త్ డే సౌరవ్ గంగూలీ.. టీమిండియాకు ‘దాదా’గిరి నేర్పిందే గంగూలీ..!

HBD Sourav Ganguly: హ్యాపీ బర్త్ డే సౌరవ్ గంగూలీ.. టీమిండియాకు ‘దాదా’గిరి నేర్పిందే గంగూలీ..!

నేడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పుట్టినరోజు. 1972 జులై 8న కోల్‌కతాలో గంగూలీ జన్మించాడు. కోల్‌కతాకు చెందిన గంగూలీ టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతి బ్యాటింగ్, కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కతా యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు ఉన్నాయి. 2003లో ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా దాదానే.

17 ఏళ్ళ పాటు భారత జట్టుకు సేవలు
సౌరవ్ గంగూలీ దాదాపు 17 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించారు. ఆటగాడిగానే కాకుండా నాయకుడిగా టీమిండియాకు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు. ఈక్రమంలోనే వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లు, రికార్డులు అందుకున్నాడు. ఈక్రమంలో 25 ఏళ్ల క్రితం బెంగాల్‌ టైగర్‌ సాధించిన రెండు రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.

టీమిండియాకు ‘దాదా’గిరి నేర్పిందే గంగూలీ
పోటీతత్వం అధికంగా ఉండే క్రికెట్‌లో ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు ‘కామ్’గా ఉంటే కుదరదన్న కెప్టెన్ గంగూలీ. ‘ఆటకు ఆటతో పాటు మాటకు మాట’ అనడం ఎలాగో టీమిండియాకు నేర్పించాడు. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే తత్వాన్ని వీడి అవతలివాడి రెండు చెంపలు పగలగొట్టేంత ధైర్యాన్ని నూరిపోశాడు. ఇప్పుడు ‘అగ్రెసివ్ అటిట్యూడ్’ అన్న పదానికి దాదా తన హయాంలోనే తాత్పర్యాలు, వివరణలు కూడా ఇచ్చేశాడు.

Recent

- Advertisment -spot_img