ఇదేనిజం, హైదరాబాద్: గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాతబస్తీ హుస్సేని అలం పీఎస్ పరిధిలోని ఖభూతర్ ఖానా ప్రాంతంలో చోటు చేసుకున్నది. సూర్యాపేట జిల్లా అప్పన్న పేట గ్రామానికి చెందిన భూపతి శ్రీకాంత్ పోలీస్ ఔట్ పోస్ట్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం విధులు ముగించుకొని పడుకొనే క్రమంలో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. తీవ్రంగా గాయపడిన భూపతిని తోటి సిబ్బంది ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Head Constable:గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
RELATED ARTICLES