వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఈక్రమంలో వర్షాకాలంలో పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పప్పుధాన్యాలు తినటం వల్ల గ్యాస్, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు.