Homeఫ్లాష్ ఫ్లాష్Benefits with Custard Apple : సీతాఫలాలతో ఈ రోగాలన్నీ ఆపోచ్చా..

Benefits with Custard Apple : సీతాఫలాలతో ఈ రోగాలన్నీ ఆపోచ్చా..

Health Benefits with Custard Apple : సీతాఫలాలతో ఈ రోగాలన్నీ ఆపోచ్చా..

ఇప్పుడున్న కాలంలో చాలా మందిలో ఇమ్యూనిటి లెవల్స్‌ తగ్గిపోతున్నాయి.

అలాగే రకరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి.

కారణం.. తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, పీల్చే గాలి తదితర కారణాల వల్ల ఆరోగ్యానికి గురవుతున్నారు.

అయితే ప్రతి రోజు పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలున్నాయి.

వీటి వల్ల వివిధ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు.

కొన్ని పండ్లు ఏడాది పొడవునా లభిస్తుంటే.. మరి కొన్ని పండ్లు సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి.

అలాంటి పండ్లను మాత్రం వదిలిపెట్టకుండా తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి.

ఈ వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు.

ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి.

సీతాఫలం అల్సర్లను నయం చేయడంలోనూ, అసిడిటీని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది.

సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు.

సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.

సీతాఫలంలో ఫైబర్‌..

సీతాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా ఉంటుంది.

కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.

ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

8 Surprising Benefits

  1. High in antioxidants
  2. boost your mood
  3. benefit eye health
  4. prevent high blood pressure
  5. promote good digestion
  6. have anticancer properties
  7. fight inflammation
  8. support immunity

Recent

- Advertisment -spot_img