Health Benefits with Orange Juice : నారింజ రసంతో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా
బాగా అలసిపోయినప్పుడు నారింజ రసం(Orange Juice) తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది.
అంతేకాదు, నారింజ రసం శరీరంలో జరిగే ‘ఆక్సిడేటివ్ స్ట్రెస్’ అనే రసాయన ప్రక్రియనూ నియంత్రిస్తుందని తాజా అధ్యయనం చెబుతున్నది.
నారింజలోని ‘హెస్పెరిడిన్’ అనే పదార్థానికి ఈ శక్తి ఉందని గుర్తించారు.
దీర్ఘకాలికంగా వెంటాడే వాపు, మంట, నొప్పి మొదలైనవాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు.
కానీ, దీనివల్ల భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువ.
అంతేకాదు, స్వచ్ఛమైన నారింజ రసంలో విటమిన్-సి మొదలైన పోషకాలూ అపారం.
కాకపోతే ఇందులో చాలామంది చక్కెర, ఉప్పు మొదలైనవి కలుపుకొని తాగుతారు.
ఫలితంగా నారింజరసం తన సహజ సామర్థ్యాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయ నిపుణులు.