బీట్‌రూట్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో నైట్రేట్‌తో పాటు విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ సమకూరుతుంది. బాడీలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా పెద్దపేగుల్లో క్యాన్సర్ రాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది.