బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చాలా సమస్యలొస్తాయి. అందుకే దానిని తగ్గించుకోవాలి. ఉసిరిని జ్యూస్‌లా చేసి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం ఉసిరి కాయలను గింజలు లేకుండా ముక్కలుగా కట్ చేయాలి. దీనికి నీటిని కలిపి జ్యూస్‌లాగా చేయాలి. తర్వాత అవసరమనుకుంటే వడకట్టండి. లేదంటే అలానే తీసుకోవచ్చు. దీనిలో కొద్దిగా తేనె, అల్లం, మిరియాల పొడి లేదా ఉప్పు వేసి తాగండి. ఇలా రెగ్యులర్‌గా తాగితే రిజల్ట్ ఉంటుంది.