హైదరాబాద్ శివారుల్లో హృదయ విదారకమైన రైలు ప్రమాదం జరిగింది. బీబీనగర్ – ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఓ వృద్ధుడు పట్టాలు దాటుతుండగా వరంగల్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. అయితే అతడి మృతదేహం రైలు ఇంజిన్‌కు చిక్కుకోవడంతో 5 కిలోమీటర్ల వరకు అలాగే వచ్చింది. దాన్ని గమనించిన స్థానికులు లోకో పైలట్‌కు సూచనలు చేయడంతో రైలును ఆపి CRPF పోలీసుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.