Homeహైదరాబాద్latest Newsఆహారాన్ని వేడి చేసి తింటున్నారా? డేంజర్ జోన్ లో పడ్డట్టే

ఆహారాన్ని వేడి చేసి తింటున్నారా? డేంజర్ జోన్ లో పడ్డట్టే

కొన్నిసార్లు మనం ఉద్దేశపూర్వకంగా ఆహారాన్ని అతిగా వండుకుంటాం. సమయాభావం వల్ల మళ్లీ వేడి చేసి తింటాం. కానీ, ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం కావడమే కాకుండా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రసాయనాలు విడుదలవుతాయి. ఇందులో ముఖ్యంగా బీట్‌రూట్‌ను ఎప్పుడూ మళ్లీ వేడి చేసి తినకూడదు. దీన్ని మళ్లీ వేడి చేయడం ద్వారా, అందులోని నైట్రేట్‌లు నాశనమై, ప్రయోజనకరంగా కాకుండా ఆరోగ్యానికి హానికరం. మనం సాధారణంగా పూరీ, పకోడీ లేదా డీప్ ఫ్రై చేసిన వస్తువుల కోసం పాన్‌లో ఎక్కువ నూనె వేస్తాము. ఆపై మిగిలిన నూనెను మళ్లీ వేడి చేసి వాడతారు, ఇది కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం. వేడి వేడి చికెన్ ఎంత రుచికరమైనదో, మరుసటి రోజు వేడి చేసుకునే తింటే అంతే ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఈ వంటకాన్ని రిఫ్రిజిరేటర్ నుండి తీసి వేడి చేసినప్పుడు, దాని ప్రోటీన్ పూర్తిగా మారిపోతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Recent

- Advertisment -spot_img