Homeఫ్లాష్ ఫ్లాష్పాకిస్థాన్ వికెట్ కీపర్ పై తీవ్ర విమర్శలు.. ఇలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు సిగ్గుపడాలంటూ కామెంట్స్..?

పాకిస్థాన్ వికెట్ కీపర్ పై తీవ్ర విమర్శలు.. ఇలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు సిగ్గుపడాలంటూ కామెంట్స్..?

పాకిస్థాన్ వికెట్ కీపర్ ఆజం ఖాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌లో విఫలమై పాకిస్థాన్ ఓటమికి కారణమయ్యాడని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అతడు ఔటైన తీరుపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లండ్ సన్నాహకంగా పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భారీకాయంతో ఉండే అజామ్ ఖాన్ ఘోర తప్పిదాలు చేశాడు. ఫిలిప్ సాల్ట్ విల్ జాక్స్ ద్వారా సాధారణ క్యాచ్‌లను అందుకోలేకపోయాడు. ఫీల్డింగ్‌లో చురుకుగా ఉండట్లేదని కారణంతో మహ్మద్ రిజ్వాన్‌కు బదులుగా ఆజామ్ ఖాన్‌కు బాబర్ గ్లవ్స్ బాధ్యతలు అందించాడు. అయితే వికెట్ కీపింగ్‌లో ఆజం నిరాశపరిచాడు. అంతేకాదు బ్యాటింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఐదు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. మార్క్‌వుడ్ వేసిన రాకెట్ బాల్‌ను అంచనా వేయడంలో అజామ్ విఫలమయ్యాడు. దీనితో అజామ్‌ ఖాన్‌పై ఆ దేశ క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మా దేశంలో బంధుప్రీతి ఎంత భయకరంగా ఉందో తెలియజేసేందుకు అజామ్‌ ఖాన్ ఎంపికే ఉదాహరణ. ఇలాంటి ఆటగాళ్లను ఎంపిక చేసిన వారు సిగ్గుపడాలి’ అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఇంగ్లండ్ రాకెట్‌కు పాకిస్థాన్ కొండ నేలకూలిందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img