Homeతెలంగాణమరో 2 రోజులు

మరో 2 రోజులు

రాష్ట్రంలో వానల జోరు తగ్గడం లేదు. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అనేక చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో పాటు చాలా జిల్లాల్లో జనాలు వర్షం దాటికి ఇళ్ళకే పరిమితం అయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు ప్రజలు బయటకు రావద్దని, సహాయక చర్యలు అందించడంతో పాటు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇరు రాష్ట్రాల సీఎంలు తెలిపారు. హైదరాబాద్​, వరంగల్​ వంటి పట్టణాల్లో రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లోని ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస వసతులు వర్షం కారణంగా దూరమవుతున్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img