Homeతెలంగాణఇయ్యాల తెలంగాణలో భారీ వానలు

ఇయ్యాల తెలంగాణలో భారీ వానలు

– హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడి

ఇదే నిజం, హైదరాబాద్: మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్​తో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే వీలుందని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


వర్షాలపై అధికారుల సమీక్ష..


మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ‘ బుధవారం భారీ వర్షసూచన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపిస్తున్నాం. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’అని రాహుల్‌ బొజ్జా ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img