Homeహైదరాబాద్latest Newsరానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్..తస్మాత్ జాగ్రత్త..!

రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్..తస్మాత్ జాగ్రత్త..!

రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద, షియర్ జోన్ ఉన్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నేడు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు కురుస్తోంది. సిటీలో ఉదయం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి చిరుజల్లులతో వర్షం మొదలైంది. అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర నగర వాసులను ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img