Homeఫ్లాష్ ఫ్లాష్#KTR : వ‌ర‌ద బాధితులు మీ-సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోండి.. కేటీఆర్‌

#KTR : వ‌ర‌ద బాధితులు మీ-సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోండి.. కేటీఆర్‌

హైదరాబాద్: వర్షం ఆగకముందే వరద సాయం ప్రకటించిన ఘనత తమ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇంకా సాయం అంద‌ని నిజమైన వరద బాధితులు ఉంటే మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.

వరద బాధితుల కోసం అదనంగా మరో రూ.70 కోట్లు కేటాయించనున్నట్టు ఆయ‌న‌ వెల్లడించారు.

దీపావళి కానుకగా..

దీపావళిని పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.14,500 నుంచి రూ.17,500కి పెంపుదల చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. ఇది రూ.15 వేల వరకు ఆస్తిపన్ను కట్టిన వారికి వర్తించనుందని తెలిపారు.

ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలలోపు ఆస్తి పన్నుకట్టే వారికి వర్తించనుందని వెల్లడించారు. దీని వల్ల హైదరాబాద్‌లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.

ఎన్నిక‌ల‌కు తొంద‌రేమీ లేదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తొందర పడాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ వెల్లడించారు.

డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని రెండు రోజులుగా మీడియాలో తీవ్రంగా ప్రచారం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం సంత‌రించుకోంది.

Recent

- Advertisment -spot_img