Homeజిల్లా వార్తలురోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన స్నేహితుని కుటుంబానికి చేయూత

రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన స్నేహితుని కుటుంబానికి చేయూత

ఇదేనిజం రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మ్యాడారపు అనిల్ కుమార్(22)అనే యువకుడు కడెం వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోయాడు.మృత్తునికి భార్య,7 నెలల కూతురు ఉన్నారు.విషయం తెలుసుకున్న క్లాస్‌మేట్స్ (SSC BATCH 2013-14)అందరు కలిసి మా స్నేహితుడు కుటుంబానికి సహాయం చెయ్యాలని 23,500/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వారు మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం అని వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా నడపాలని, హెల్మెట్ ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు అని అన్నారు.దాతలు ఎవరైనా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, మా మా క్లాస్‌మేట్స్ తరుపున ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లాస్‌మేట్స్ ,గ్రామస్తులు పాల్గొన్నారు…. అన్నీ బంధలకన్న స్నేహబంధం మిన్నా అని నిరూపించారు

Recent

- Advertisment -spot_img