Homeఫ్లాష్ ఫ్లాష్హీరో ధనుష్ Fitness కు కార‌ణాలేంటి.. మీరూ ఫిట్‌గా ఉండాలా..

హీరో ధనుష్ Fitness కు కార‌ణాలేంటి.. మీరూ ఫిట్‌గా ఉండాలా..

Hero Danush diet and Fitness secrets : హీరో ధనుష్ ఫిట్‌నెస్‌కు కార‌ణాలేంటి.. అలా మీరూ ఫిట్‌గా ఉండాల‌నుకుంటున్నారా..

హీరో ధనుష్ అంటే పరిచయం అకర్లేని పేరు. Fitness

నటనలో తనదైన శైలితో ఆకట్టుకునే హీరో ధనుష్ రజనీకాంత్ అల్లుడిగా మారి మరింత పాపులర్ అయ్యారు.

అయితే తను కేవలం నటనతోనే కాదు.. తన బాడీతోనూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వయసుతో సంబంధం లేకుండా సన్నని బాడీతోనూ సిక్స్ సాధ్యమని నిరూపించాడు.

ఇటీవలే తన మామయ్య రజనీకాంత్ తో కలిసి జాతీయ చలనచిత్ర అవార్డును సైతం అందుకున్నాడు.

ఈ సందర్భంగా తన డైట్ అండ్ ఫిట్ నెస్ కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను షేర్ చేసుకున్నాడు. మీరు కూడా మూడు పదుల వయసు దాటినా.. ధనుష్ లా సన్నగా.. బరువును సులభంగా తగ్గాలనుకుంటే.. ఆ హీరో పాటించిన చిట్కాలేంటో చూసేయ్యండి….

మనలో కొందరు బాడీని చాలా బలంగా ఉంచుకుంటారు. వారి బాడీ చాలా బలంగా.. బిగువైన కండరాలను కలిగి ఉంటుంది.

అలాంటి వారిని చూసినప్పుడు మనలో చాలా మందికి మనం కూడా అలా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.

అలా కోరుకునే వారిలో మీరు కూడా ఒకరైతే.. ఒక సంపూర్ణ బిగువైన శరీరం పొందడానికి సరైన టెక్నిక్ ఉపయోగించాలి.

అంతేకానీ రాత్రికి రాత్రే అద్భుతాలు సాధించాలనుకుంటే మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయి.

నిలకడ ఉండాలి..

మీరు కూడా ధనుష్ లాంటి బాడీ కావాలంటే కొంతకాలం పాటు ఓపికగా ఉండాలి.

ముఖ్యంగా మీ బాడీ బరువు విషయంలో చాలా బ్యాలెన్స్ గా ఉండాలి.

బాడీ బిల్డ్ చేయడానికి ఎంపిక చేసుకొన్న సమయంలో మొదటి 6 నెలల నుండి 12 నెలల సమయంలో మీరు ఒక అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు.

ధనుష్ డైట్… For Fitness

ఓ ఇంటర్వ్యూలో ధనుష్ తన డైట్ వివరాలను వెల్లడించాడు.

‘తాను మంచి బాడీ షేప్ కోసం ఆహారం విషయంలో కొన్ని కఠినమైన పద్ధతులను అనుసరిస్తాను.

ముఖ్యంగా జంక్ ఫుడ్ జోలికి వెళ్లను. సాధారణంగానే నేను స్వీట్ ఇష్టపడను.

అయితే కార్బోహైడ్రేట్ కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకుంటాను’ అని వివరించారు.

రెగ్యులర్ వర్కవుట్లు..

‘ఇక నా ఫిట్ నెస్ విషయానికొస్తే.. నేను రెగ్యులర్ గా వర్కవుట్లు చేస్తాను.

దీని వల్ల ఎవ్వరైనా బరువు సులభంగా తగ్గొచ్చు. కాబట్టి ఎక్సర్ సైజ్ చేయడం చాలా ముఖ్యం.

అలాగే అందుకు తగ్గట్టు సరైన ఆహారం తీసుకోవాలి’ అని వెల్లడించారు.

మంచి జిమ్.. Fitness

మీరు కూడా ధనుష్ లాంటి హ్యాండ్సమ్ బాడీ కావాలనుకుంటే.. తన లాగా కండరాలను బిగుతుగా మార్చుకోవాలంటే.. మీరు మంచి కండిషన్ లో ఉన్న జిమ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

అందులో మంచి డంబెల్స్ తో పాటు వెరైటీగా ఉన్న వాటిని చూసుకోవాలి. అలాగే వాతావరణం, లొకేషన్ కూడా ఒకసారి చెక్ చూసుకోవాలి.

కండరాలకు తగిన బలం..

అధిక బరువులు ఎత్తడానికి ముందు, ప్రమాదం, గాయాలను నివారించడం కోసం మీ కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చాలి.

నొప్పిని భరించేటంత బలంగా మీ కండరాలు తయారైనప్పుడు, అప్పుడు మీరు బాడీబిల్డింగ్ మరియు స్ట్రెంగ్గ్ ట్రైనింగ్ ను మొదలు పెట్టొచ్చు.

మీ బాడీ గురించి..

అన్నింటి కంటే ముందుగా మీరు మీ బాడీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి.

మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీ బాడీ సహకరించాలని సంకల్పంతో ఉండాలి.

అప్పుడే వ్యాయామాలు మొదలుపెట్టండి. అప్పుడే మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు.

అలాగే మీ బాడీకి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. అప్పుడే వర్కవుట్లు చేయాలి. ముఖ్యంగా మీ శరీరంపై అధిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

ఎక్కువ నీరు..

మీరు రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేసేటప్పుడు వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.

అయితే మధ్య మధ్యలో కొన్ని వాటర్ తాగాలి. ఇలా తాగడం వల్ల మీ బాడీ హైడ్రేషన్లో ఉండటానికి సహాయపడుతుంది.

ఇది అలసటను నివారించేందుకు సహాయపడుతుంది.

అలాగే శ్వాస తీసుకోవడంలో ఎక్కువ ఫోకస్ ఉంచాలి. రిపీట్ గా వెయిట్లు ఎత్తడం వల్ల మీ బాడీ డెవలప్ అయిపోతుంది.

Recent

- Advertisment -spot_img