Homeహైదరాబాద్latest Newsస్ప్లెండర్ బైక్‌కు ముప్పై ఏళ్లు

స్ప్లెండర్ బైక్‌కు ముప్పై ఏళ్లు

హీరో స్ప్లెండర్. సామాన్యుడి బైక్. ముప్పై ఏళ్లుగా మార్కెట్లో నిలదొక్కుకుంది. ఎన్నో కొత్తకొత్త మోడల్స్ వస్తున్నప్పటికీ ఈ మోడల్ ప్రత్యేకం. మధ్య తరగతి వాళ్లకు అందుబాటు ధరలో ఉంటుంది. సీటింగ్ పొజిషన్, కంఫోర్ట్, ఫ్లెక్సిబిలిటీ, డ్యూరెబిలిటీ, నాణ్యత, ఎక్కువకాలం మన్నిక తదితర అంశాలు కస్టమర్లను ఆకర్శించడం ప్రధాన కారణం. 30 ఏళ్లైన సందర్భంగా హీరో కంపెనీ కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది.

స్ల్పెండర్‌+ ఎక్స్‌టెక్‌ 2.0 పేరిట వస్తున్న ఈ బైక్‌ ధర రూ.82,911. గత ఎక్స్‌టెక్‌ వెర్షన్‌తో పోలిస్తే రూ.3,000 అధికం. లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పొజిషన్‌ ల్యాంప్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను అప్‌డేట్‌ చేశారు. వెనక భాగంలో హెచ్‌ ఆకారంలో ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌ను ఇచ్చారు. మ్యాట్‌ గ్రే, గ్లోస్‌ బ్లాక్‌, గ్లోస్‌ రెడ్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. సైడ్‌ హుక్స్‌, ట్యూబులార్ గ్రాబ్‌ రెయిల్‌, ఇంజిన్‌ క్రాష్‌ గార్డ్‌ వంటి వాటిలో ఎలాంటి మార్పులు చేయలేదు. సీటు పొడవును, గ్లవ్‌ బాక్స్‌ పరిమాణాన్ని పెంచారు.

Recent

- Advertisment -spot_img