హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం గురువారం (డిసెంబర్ 12) గోవాలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య ఆంటోనీ.. కీర్తి సురేష్ మెడలో తాళి కట్టారు. పెళ్లి డేట్‌ను ముందు నుంచి సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చిన కీర్తి, తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది కీర్తి. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో కీర్తి సురేశ్ వివాహ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే క్రిస్టియన్ పద్దతిలోనూ పెళ్లి జరుగనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.







