ముంబైలోని కండవాలి వద్ద బోయిసర్ మెట్రో స్టేషన్ సమీపంలో మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి. గత రాత్రి కొంత మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఆ సమయంలో మరాఠీ నటి ఊర్మిళ కొఠారే షూటింగ్ ముగించుకుని కారులో ఇంటికి వెళుతోంది. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ అదుపు తప్పి అక్కడ పనిచేస్తున్న వారిపై కార్ దూసుకెళ్లింది. వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నటి ఊర్మిళ కొఠారే స్వల్ప గాయాలతో బయటపడగా, డ్రైవర్‌కు తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.హ్యుందాయ్ వెర్నా కారు ప్రమాదానికి కారణమైందని, ఎయిర్‌బ్యాగ్ నటి ప్రాణాలను కాపాడిందని సమాచారం. డ్రైవర్‌పై అతివేగంగా నడపడం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాపాయం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.