Homeజిల్లా వార్తలుబంగారు నగలను దాచుకోండి

బంగారు నగలను దాచుకోండి

– ఊరికి వెళ్లేవాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వండి
– వెల్గటూరు ఎస్సై శ్వేత

వెల్గటూర్, ఇదే నిజం: సంక్రాంతి పండగకు ఊర్లకు వెళ్లే వాళ్లకు వెల్గటూరు ఎస్సై శ్వేత పలు కీలక సూచనలు చేశారు. బంగారు నగలను ప్రజలు దాచుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే వాళ్లు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వెల్గటూరు ఎస్సై శ్వేత శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ ను సంబంధిత పోలీసు స్టేషన్ లో తెలపాలన్నారు. వాళ్ల ఇండ్లపై కచ్చితంగా నిఘా పెడతామన్నారు. ఊర్లకు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పి వెళ్లాలన్నారు. మెయిన్ డోర్ కు తాళం వేసి వెళ్లేటప్పుడు ఆ యొక్క తాళం కనిపించకుండా డోర్ కర్టెన్స్ అడ్డు కట్టాలని, వీలైతే హోమ్ అలారం ను ఏర్పాటు చేసుకుంటే భద్రతగా ఉంటుందని సూచించారు. విలువైన వస్తువులను బైక్ డిక్కీల్లో, కారులలో జాగ్రత్తగా పెట్టడం వంటివి చేయకూడదని, ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలని, ఎక్కడపడితే అక్కడ రోడ్లపై నిలుపకూడదని వివరించారు.

Recent

- Advertisment -spot_img