భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందా? అంటే వాతావరణ శాఖ అధికారులు అవుననే అంటున్నారు . జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు బుధవారం తెలిపారు. ఆగస్టు 15 నుంచి 30 మధ్యకాలంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు.