Homeహైదరాబాద్latest Newsస్పెషల్​ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు.. జనం జేబులకు చిల్లులు..

స్పెషల్​ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు.. జనం జేబులకు చిల్లులు..

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో జనమంతా స్వగ్రామాలకు పయనమవుతున్నారు. దీంతో బస్​ స్టాండ్​లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఇదే అదనుగా భావించిన టీఎస్​ ఆర్టీసీ ప్రయాణికులకు షాకిచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో వారి నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తుంది. సాధారణ ఛార్జీల కంటే అధికంగా వసూలు చేస్తుంది. అందేంటని ప్రశ్నిస్తే స్పెషల్​ బస్సు అని సమాధానం చెబుతున్నారు. సిటీ బస్సులను పలు రూట్లలో నడిపిస్తూ ఒక్కొక్కరికి రూ. 50 నుంచి రూ.100 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. పైగా బస్సులపై స్పెషల్​ బస్సులని బోర్డు పెట్టడం లేదు. తీర ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత ఇది ప్రత్యేక బస్సు అని చెప్పి ఎక్కువ డబ్బులు లాగుతున్నారు. ఈ తతంగంపై ఆర్టీసీ అధికారులను ఆరా తీయగా.. ప్రత్యేక బస్సులకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఓటు వేసేందుకు వెళ్తున్న క్రమంలో ఇలా ఛార్జీల పెంచడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సోషల్​ మీడియా వేదికగా ఆర్టీసీ అధికారులను, ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img