Homeహైదరాబాద్latest Newsఅతని ఆత్మ నన్ను వెంటాడుతోంది.. భయంతో నాకు నిద్ర పట్టడం లేదు: స్టార్ హీరో

అతని ఆత్మ నన్ను వెంటాడుతోంది.. భయంతో నాకు నిద్ర పట్టడం లేదు: స్టార్ హీరో

కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న అతడు ప్రస్తుతం బళ్లారి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రేణుకాస్వామి ఆత్మ తనను వెంటాడుతోందని, భయంతో తనకు నిద్ర పట్టడం లేదని ఆయన జైలు అధికారులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఒంటరిగా ఉండలేనని బెంగళూరు జైలుకు తరలించాలని అభ్యర్థించినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి దర్శన్ నిద్రకు భంగం కలిగిస్తున్నాడని, గట్టిగా అరుస్తున్నాడని తోటి ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది.కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసందే. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న దర్శన్‌ను బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల బళ్లారి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.

Recent

- Advertisment -spot_img