Homeహైదరాబాద్latest Newsఅక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారుల కొరడా..

అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారుల కొరడా..

ఇదేనిజం, శేరిలింగంపల్లి : మియాపూర్ లోని సర్వే నం 101 లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ అధికారులు కొరడా ఝులిపించారు. అయితే ఇటీవల హెచ్ఎండీఏ , రెవిన్యూ అధికారులు జాయింట్ సర్వేచేసి అక్రమ నిర్మాణాలను గుర్తించి మార్కింగ్ చేశారు. గురువారం (మే 30) మధ్యాహ్నం హెచ్ఎండీఏ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని సర్వే నం 101లో వెలిసిన 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు ఉంటుదని 100, 101 జంట సర్వే నంబర్లలో గుర్తించిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ కూల్చివేతలో ఇన్స్పెక్టర్ తిరుపతి, యస్ ఐ సంతోష్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్లు గౌతం, క్రాంతి, రఘు, పోలిసులు సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img