Homeతెలంగాణషబ్బీర్​ అలీకి హోం?

షబ్బీర్​ అలీకి హోం?

– త్వరలో మంత్రివర్గ విస్తరణ
– నేడు ఢిల్లీకి రేవంత్​ రెడ్డి
– కీలకశాఖపై క్లారిటీ వచ్చే చాన్స్​
– మైనార్టీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్​
– షబ్బీర్​ అలీకి హోం ఇవ్వాలని పట్టుబడుతున్న సీఎం రేవంత్​ రెడ్డి?
– మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్​ లీడర్లు
– ఓడినవాళ్లకు ఇచ్చేది లేదంటూ కాంగ్రెస్​ నిర్ణయం
– షబ్బీర్​ అలీ విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చే చాన్స్​

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హోంశాఖ మంత్రిగా షబ్బీర్​ అలీగా అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్​ వర్గాల నుంచి జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి సైతం షబ్బీర్​ అలీకి హోంశాఖ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు అవకాశం ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఓడిపోయిన అభ్యర్థులకు పదవులు ఇవ్వొద్దని కాంగ్రెస్​ పార్టీ నియమం పెట్టుకున్నప్పటికీ .. షబ్బీర్​ అలీ విషయంలో మినహాయింపు ఇచ్చే చాన్స్​ ఉందని తెలుస్తోంది. మైనార్టీ కోటా నుంచి షబ్బీర్​ అలీకి అవకాశం వచ్చే చాన్స్​ ఉందని తెలుస్తోంది.

హోం ఎంతో కీలకం
ఏ రాష్ట్రంలోనైనా హోంశాఖ అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. ఈ శాఖకు ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతల బాధ్యతంతా హోంశాఖ. సహజంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోటు ముఖ్యమంత్రులు తనకు అనుకూలంగా ఉంటే నేతలను హోంశాఖ మంత్రులుగా నియమించుకుంటూ ఉంటారు. ఇక కాంగ్రెస్​ పార్టీ జాతీయ పార్టీ కావడంతో హోంశాఖ ఎవరికి ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్​ మారింది. హోంశాఖను ఉత్తమ్​ కుమార్​ రెడ్డికి కేటాయించినట్టు తొలుత జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ శాఖను ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఇవ్వలేదు. ప్రస్తుతం సీఎం దగ్గరే ఉంది. దీంతో ఈ శాఖ ఎవరికి ఇవ్వబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్​ గా మారింది. రేవంత్​ రెడ్డికి పడని సీనియర్​ నేతలకు ఈ పోస్టు అప్పగిస్తే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకే హోంశాఖ రేవంత్​కు అనుకూలంగా ఉండే వ్యక్తికే ఇస్తారని సమాచారం.

మైనార్టీల వైపు మొగ్గు
హోంశాఖను మైనార్టీ నేతలకు కేటాయించాలని కాంగ్రెస్​ హైకమాండ్​ సైతం భావిస్తున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో మైనార్టీలు కొంత మేర కాంగ్రెస్​ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో పార్లమెంటు ఎన్నికల నాటికి వారిని మరింత చేరువ చేసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్​ కు ప్రొటెం స్పీకర్​ గా అవకాశం ఇచ్చారు. ఎంతోమంది సీనియర్​ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్​కే ఆ చాన్స్​ రావడం గమనార్హం. ఇక తాజాగా హోంశాఖ కూడా మైనార్టీలకు కేటాయిస్తే వారంత తమ పట్ల సానుకూలంగా ఉంటారని కాంగ్రెస్​ పార్టీ లెక్కలు వేసుకుంటున్నది. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్​.. షబ్బీర్​ అలీకి హోంశాఖ కేటాయించిన విషయం తెలిసిందే. అదే స్ట్రాటజీని ఇప్పుడు కాంగ్రెస్​ పార్టీ ప్లే చేయబోతున్నది. ఇక షబ్బీర్​ అలీ సైతం రేవంత్​ రెడ్డి కోసం తన సీటును త్యాగం చేశారు. నిజామాబాద్​ అర్బన్​ లో పోటీచేసి ఓడిపోయారు. ఇక కాంగ్రెస్​ పార్టీలో మైనార్టీ కోటా నుంచి సీనియర్​ లీడర్​ గా ఉన్నారు. ఫిరోజ్​ ఖాన్​ సైతం నాంపల్లి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో సీనియర్​ లీడర్​ షబ్బీర్​ అలీ కనక అతడికే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రేవంత్​ రెడ్డి సైతం షబ్బీర్​ అలీకి హోంశాఖ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారట. ఇక తాజాగా మంత్రి వర్గ విస్తరణ జరగబోతుండటంతో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​కు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img