Homeలైఫ్‌స్టైల్‌కరోనాకు ఇంటి చిట్కాతో చెక్

కరోనాకు ఇంటి చిట్కాతో చెక్

  • సాంప్రదాయ ఆవిరి పట్టడంతో వ్యాధినిరోధకశక్తి డబుల్
  • ప్రయోగాలతో నిరూపించిన ముంబై హాస్పిటల్
  • 105 మంది కరోనా పేషెంట్లపై ప్రయోగం
  • మూడు నుంచి ఆరు రోజుల్లో కోలుకున్న పేషెంట్లు


కరోనా వైరస్ ఎదుర్కోవడంలో వ్యాధినిరోధకశక్తి ప్రధాన భూమిక పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని పెంచుకోవడానికి వివిధ మార్గాలను నిపుణులు తెలియజేస్తున్నారు. కొందరు పాలు పసుపు డ్రైఫ్రూట్స్ తీసుకుంటే మరికొందరు సాంప్రదాయ ఆహార పదార్థాలను తీసుకుంటూ తమ వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా ముంబైలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్ వారు సాంప్రదాయ వైద్యం ద్వారా కట్టడి చేయడం పై ప్రయోగాలు నిర్వహించి మంచి ఫలితాలు సాధించారు. ఇందులో వారు సాంప్రదాయ సుగంధ ద్రవ్య పదార్థాలైన పసుపు, అల్లం తదితర పదార్థాలతో ఆవిరి పట్టడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి ది క్రితం అవుతుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. డాక్టర్ దిలీప్ పవర్ ఆధ్వర్యంలో వైద్య బృందం 105 మంది కరోనా పేషెంట్ల పై మూడు నెలల పాటు పరిశోధన చేసింది.


రెండు గ్రూపుల పై వేరువేరుగా పరిశోధన

కరోనా లక్షణాలు తీవ్రతను బట్టి పేషెంట్లను రెండు గ్రూపులుగా విభజించారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని మొదటి గ్రూప్ లో చేర్చి వారికి రోజుకు మూడు సార్ల చొప్పున ఆవిరి పట్టారు. వారందరూ మూడు రోజుల్లో నే కోలుకున్న ట్లు వైద్యులు వెల్లడించారు. కరుణ లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని రెండో గ్రూపులో చేర్చి వారికి మూడు గంటలకు ఒకసారి చొప్పున ఆవిరి పట్టారు. వారందరూ వారం రోజుల్లో తిరిగి సాధారణ స్థితికి వచ్చారని సెవెన్ హిల్స్ వైద్య వర్గాలు ప్రకటించాయి.

Recent

- Advertisment -spot_img