Homeలైఫ్‌స్టైల్‌#Honey #Pure : కొనేముందు స్వచ్ఛమైన తేనెను ఇలా గుర్తించండి

#Honey #Pure : కొనేముందు స్వచ్ఛమైన తేనెను ఇలా గుర్తించండి

Honey is good for health and beauty. Its use is widely used. Once upon a time honey was supplied from the villages. Now there are various brands in the cities to make honey.

ఆరోగ్యానికి, అందానికి ఇలా దేనికైనా తేనె ఉపయోగపడుతుంది. దీని వాడకాన్ని విరివిగా వాడుతున్నారు. ఒకప్పుడు తేనెను పల్లెటూళ్ల నుంచి సరఫరా చేసేవాళ్లు.

ఇప్పుడు తేనె తయారు చేయడానికి నగరాల్లో రకరకాల బ్రాండ్లు ఉన్నాయి. ప్రాసెస్‌ చేసిన తేనెను అందుబాటులోకి తెస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండేందుకు ఈ తేనె తిని అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే ఓ టెస్ట్‌ ద్వారా స్వచ్ఛమైన తేనెను కనిపెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

రెండింటి మధ్య తేడా :

స్వచ్ఛమైన తేనె నల్లగా ఉంటుంది. దాన్ని సీసాలో పోసి చూస్తే అవతల ఉన్న వస్తువులు ఏవీ కనిపించవు.

అదే షాపుల్లో కొన్న తేనెను ఒకసారి చూస్తే అందులోంచి ప్రపంచమంతా కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రాసెస్‌ చేసిన తేనె కాబట్టి.

అందుకని నల్లగా ఉన్న తేనె స్వచ్ఛమైనదిగా గుర్తించండి. అలా అని నల్లగా ఉన్న తేనెంతా మంచిదైపోదు. కాలం గడిచే కొద్దీ ప్రాసెస్‌ చేసిన తేనె రంగు ముదురుగా మారిపోతుంది.

అలాంటప్పుడు ఈ టెస్ట్‌ చేయాలి.

టెస్ట్‌ :

స్పూన్‌తో కొంచెం తేనెను తీసి దానిని ఏదైన ప్లేటుపై ఒక చుక్క వేయాలి. అప్పుడా తేనె చుక్క ముద్దగా లేదా ధారలా జారిపోవాలి. అప్పడు అది మంచి తేనె అని నిర్థారించుకోవాలి.

అది చుక్కులు చుక్కలుగా విడిపోతే 20 శాతం కంటే తక్కువ నీరున్న తేనెలా గుర్తించాలి.

తేనె సీసాను తెరిచిన తర్వాత మొదటి మూడు నెలలపాటూ ఆ తేనె ముక్కలుగా అవ్వకుండా తేనెలాగే ఉండాలి.

అలా కాకుండా ముద్దలా, చక్కెరలా మారిపోయిందంటే అది ఎక్కువగా ప్రాసెస్‌ చేసిన తేనెలా గుర్తించండి.

Recent

- Advertisment -spot_img