Homeహైదరాబాద్latest Newsఘోరం.. బస్సు బోల్తా పడి నలుగురు మృతి, 30 మందికి గాయాలు

ఘోరం.. బస్సు బోల్తా పడి నలుగురు మృతి, 30 మందికి గాయాలు

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. ఇవాళ ఉదయం హోలాలకెరె టౌన్ సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img