Homeఫ్లాష్ ఫ్లాష్వాళ్ల‌కు ఓటు హక్కు ఎలా కల్పించారు?.. స్మృతి ఇరానీ

వాళ్ల‌కు ఓటు హక్కు ఎలా కల్పించారు?.. స్మృతి ఇరానీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రజలు భాజపాకు మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌తో భాజపా ముందుకెళ్తోందని స్మృతి ఇరానీ తెలిపారు.

భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

గడిచిన ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేసినట్లు తెరాస బద్దాలు చెబుతోందని విమర్శించారు. పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని ప్రశ్నించారు.

రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించారని నిలదీశారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి తెరాస, మజ్లీస్‌ పార్టీలు ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు.

దాదాపు 75వేల మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్‌ నగరంలో ఎలా నివసిస్తున్నారని నిలదీశారు. అక్రమ చొరబాటు దారుల నుంచి దేశాన్ని భాజపా కాపాడుతుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img