Homeఎడిటోరియల్​Decompose things : నేల‌లో క‌ల‌వడానికి ఏ వ‌స్తువుకు ఎంత సమయం పడుతుంది..?

Decompose things : నేల‌లో క‌ల‌వడానికి ఏ వ‌స్తువుకు ఎంత సమయం పడుతుంది..?

Decompose things : నేల‌లో క‌ల‌వడానికి ఏ వ‌స్తువుకు ఎంత సమయం పడుతుంది..?

మానవుడు — 1 వారం

పేపర్ టవల్ – 2-4 వారాలు

అరటి తొక్క – 3-4 వారాలు

పేపర్ బాగ్ – 1 నెల

వార్తాపత్రిక – 1.5 నెలలు

ఆపిల్ కోర్ – 2 నెలలు

కార్డ్బోర్డ్ – 2 నెలలు

కాటన్ గ్లోవ్ – 3 నెలలు

ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు

ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు

ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు

మిల్క్ కార్టన్లు – 5 సంవత్సరాలు

సిగరెట్ బట్స్ – 10-12 సంవత్సరాలు

తోలు బూట్లు – 25-40 సంవత్సరాలు

టిన్డ్ స్టీల్ క్యాన్ – 50 సంవత్సరాలు

ఫోమేడ్ ప్లాస్టిక్ కప్పులు – 50 సంవత్సరాలు

రబ్బరు-బూట్ ఏకైక – 50-80 సంవత్సరాలు

ప్లాస్టిక్ కంటైనర్లు – 50-80 సంవత్సరాలు

అల్యూమినియం కెన్ – 200-500 సంవత్సరాలు

ప్లాస్టిక్ సీసాలు – 450 సంవత్సరాలు

పునర్వినియోగపరచలేని డైపర్స్ – 550 సంవత్సరాలు

మోనోఫిలమెంట్ ఫిషింగ్ లైన్ 600 సంవత్సరాలు

ప్లాస్టిక్ సంచులు 200-1000 సంవత్సరాలు.

ఈ రోజు ఎక్కడ చూసినా అంతా ప్లాస్టిక్‌, వాడి పారేసే ప్లాస్టిక్‌ కవర్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు, ప్లాస్టిక్‌ ప్లేట్స్‌, ప్లాస్టిక్‌ పూలు- ఇలా ప్రతీది ప్లాస్టిక్‌మయం.

ప్లాస్టిక్‌ లేని ప్రపంచాన్ని ఊహించలేం.

ప్లాస్టిక్‌ ను ఇంతగా వాడడానికి కారణాలను అన్వేషిస్తే సులభంగా ఉం టుందని, ఖర్చు తక్కువగా ఉంటుందని, త్వరగా శుభ్రం చేసు కోవచ్చని, వాడి పడేయవచ్చు అనిఇలా అనేక రకాల కారణాల తో మనమే దానిని ఎక్కువగా వాడుతున్నాం.

ఈ కారణంతో మనం 21వ శతాబ్దాన్ని ప్లాస్టిక్‌ శతాబ్దంగా మార్చివేస్తున్నాం. ప్లాస్టిక్‌ అందుబాటులోకి వచ్చాక, వస్తు తయారీ కనీ వినీ ఎరుగని కొత్త పుంతలు తొక్కింది.

ఉష్ణం, విద్యుత్‌, ద్రావకాన్ని తట్టుకోగల శక్తి ఉండటంతో ప్లాస్టిక్‌ వస్తు తయారీలో కీలక పదార్థంగా అవతరించింది.

నేడు కంప్యూటర్‌ నుండి గడియారం వరకు, జెట్‌ విమాన భాగాల నుంచి జుట్టుకు పెట్టుకునే క్లిప్‌ల వరకు అంతా ప్లాస్టిక్‌మయం.

అప్పట్లో తమకు కావాల్సిన వస్తువులను తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ చేతి సంచులను వెంట తీసుకెళ్లేవారు. కానీ కవర్ల రాకతో ఈ పద్ధతి మారిపోయింది.

ప్రజలు చేతి సంచుల వాడకం పూర్తిగా మర్చిపోయారు.

ఈ కొత్త పోకడ మానవ జీవనానికి ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్‌ కవర్లను తయారు చేయడంలో కనీస నిబంధనలు పాటించకపోవడంతో మానవాళి మనుగడ ప్రశార్థకంగా మారుతోంది.

40 మైక్రాన్ల మందంకు మించిన కవర్తను యధేచ్ఛగా వాడుతున్నారు.

వాడి పడేసిన కవర్లు భూమిలో కలవకపోవడంతో పర్యావరణానికి తూట్లు పడుతున్నాయి.

అంతేకాకుండా పంటలను సైతం దెబ్బతీస్తోంది. ఫ్రిజ్‌లల్లో ఈ కవర్లను పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచడం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది.

హానికరమైన కార్బైడ్లు వాతావరణంలో కలుస్తూ కాలుష్యకారంగా మారుతోంది.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలవడానికి వేల‌ సంవత్సరాలు పడుతుంది.

అవి తాత్కాలికంగా శిథిలమైనా చిన్న రేణువులుగా మారి మట్టిలో కలిసిపోయి దాని సహజ లక్షణాన్ని దెబ్బతీ స్తాయి.

నేలలో చేరిన ప్లాస్టిక్‌ పదార్థాలు, నేల నీటి నిలువ సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

ఫలితంగా భూసారం క్షీణిస్తోంది. భూగర్భ జలమట్టం పడిపోతుంది.

తద్వారా పంట దిగుమతి తగ్గిపోవడం జరుగుతుంది.

దాని వల్ల భూగర్భ జలమట్టం తగ్గిపోతుంది, పంటలు సరిగా పండక తీవ్ర ఆహార సమస్య ఏర్పడడమే కాకుండా భూమి వేడెక్కడం జరుగుతుంది.

ఇదే స్థాయిలో ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత భూమి తీవ్రంగా వేడెక్కి దాని దెబ్బకు మంచు పర్వతాలు కరిగి మొత్తం ప్రాణకోటి అంతర్ధానమయ్యే పరిస్థితి ఎదురు కావచ్చు.

మురికి కాలువల్లో చేరి ప్లాస్టిక్‌ సంచులు మురుగునీటి పారుదలను అడ్డుకుంటున్నాయి.

ఫలితంగా కాలువల్లో మురికినీరు పేరుకుపోయి దోమల ఉత్పత్తి ఎక్కువవుతుంది.

దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. అలాగే పందుల బెడద ఎక్కువవుతుంది.

దానివల్ల చుట్టుపక్కల వాతావరణం అపరిశుభ్రం కావడం రకరకాల అంటువ్యాధులు అభివద్ధి చెందడం, వివిధ రోగాలు రావడం జరుగుతుంది.

పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీవాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తింటాయి.

వాటి మాంసం మనం తినటం వల్ల ప్లాస్టిక్‌ అవశేషాలు మనిషి కడుపులోకి చేరి పలు రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆవులు, గేదెలు వీటిని తినడం వల్ల అవి పాలు ఇతర పాల పదార్థాల రూపంలో మనకి చేరుకుంటాయి.

పాలల్లో ప్లాస్టిక్‌ అవశేషాలని ఇటీవల కనుక్కున్నారు కూడా. ఈ మధ్య చనిపోయిన ఒక ఆవు శరీరంలోంచి దాదాపు 75 కేజీల ప్లాస్టిక్‌ బయట పడిందంటే ఎంత ఘోరమో ఆలోచించండి.

చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థాలు వేయటంవల్ల చేపలు ఇతర జలచరాలు చననిపోతాయి.

సముద్రపు ఒడ్డులో గుడ్లు పెట్టడా నికి ఒడ్డెక్కే జలచరాలు ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను జెల్లీ చేపలుగా భ్రమించి వాటిని తిని ప్రాణాలు విడుస్తున్నాయి. ప్రమాదకర మైన ప్లాస్టిక్‌ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది.

దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 300 వేల టన్నుల క్యారీ బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, టీ కప్పులు వాడుతున్నారని ప్లాస్టిక్‌ నిషేధ నిపుణులు చెపుతున్నారు.

Recent

- Advertisment -spot_img