Homeహైదరాబాద్latest NewsLife Skills : హ్యాపీగా ఉండాలంటే ఎలా?

Life Skills : హ్యాపీగా ఉండాలంటే ఎలా?

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడమనేది బిగ్ టాస్క్. ఎంత సక్సెస్ సాధించినా డెస్టినేషన్‌ని నిర్వచించలేం. నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉండాల్సిందే. ఈ క్రమంలో కొన్నిసార్లు ఒడుదొడుకులు సహజం. అంతమాత్రాన కుంగిపోకుండా మళ్లీ ట్రై చేయాలే తప్ప డోన్ట్ గివప్. జరిగినదాని గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. తప్పులను రెక్టిఫై చేసుకోవాలి. దాని నుంచి నేర్చుకున్న పాఠాలు మనల్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ ఉండాలి.

ఏ రిలేషన్‌లో అయినా సరే ఎక్కువతక్కువ అనే భేదాభిప్రాయాలు అనవసరం. అందరూ సమానమే అనే భావన కలిగి ఉండాలి. అర్థం చేసుకోలేని వ్యక్తులు పలు విధాలుగా మాట్లాడతారు. అంతమాత్రాన తొందరపడుకూడదు. కూల్‌గా ఉంటూ నవ్వుతూ మాట్లాడటమే స్పెషల్.

హ్యాపీగా ఉండటం కోసం ఇష్టమైన పనులు చేయాలి. కొందరికి జాగింగ్ అంటే ఇష్టం. ఇంకొందరికి మ్యూజిక్ అంటే ప్రాణం. మరికొంతమందికి స్టైల్. ఇంకా అందంగా కనపడటం, డ్రైవింగ్, ఫ్రెండ్స్‌తో చిల్ అవడం, షాపింగ్, నచ్చిన ఫుడ్ తినడం, విహార యాత్రలు, దేవాలయాలకు వెళ్లడం ఇలా అనేకం ఉంటాయి. మీకు ఇష్టమైన పనుల్ని రోజూ చేస్తే సంతోషకరమైన లైఫ్‌ను కొంచెంవరకు లీడ్ చేయొచ్చు.

ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ లో అప్రమత్తత అవసరం. గతంలో ఉండకుండా ప్రస్తుత సమయానికి, సందర్భానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. ప్రశాంతతో కూడిన ఆలోచనలు పెనుమార్పులు తెస్తాయి. మంచి ఆలోచనలు రావాలంటే వాకింగ్ చేస్తే బెటర్. పరిశోధనలు కూడా వాకింగ్ ప్రాధాన్యతను నొక్కిచెప్తున్నాయి.

నిజానికి హ్యాపీనెస్‌ని మనం వేరే బయటి ఆబ్జెక్ట్స్ నుంచి ఎంజాయ్ చేయలేం. అది కేవలం ప్లెషర్ మాత్రమే. సంతోషం, జాయ్ అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. వేరే ఆలోచనల వల్ల వాటిని గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మదిలో మెదులుతూ ఉండేవాళ్లు కొంచెం తక్కువ హ్యాపీగా ఉంటారు. బయటి ఆలోచనలతో మనసును కల్మషం చేసుకోకుండా ఉండాలని స్వామి వివేకానంద చెప్పారు. అప్పుడే మనిషిలో ఉన్న సర్వశక్తుల గురించి బోధపడుతుందన్నారు . మైండ్‌‌తో కాకుండా మనసుతో గుర్తించబడేవాళ్లు ఎక్కువ సంతోషంగా ఉంటారు. నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కన్నా కాన్ఫిడెంట్ గా ఉన్న వాళ్లే గ్రేట్ అని టిమిండియా మాజీ క్రికెటర్ ధోనీ పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

ఎప్పుడూ నిరంతరంగా ఆలోచిస్తూ ఉండేవాళ్లు ఆ ఫోబియా నుంచి బయటపడటం కష్టం. కేవలం ప్రాక్టీస్ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రముఖ రచయిత Eckhart Tolle రాసిన ‘POWER OF NOW‘ వల్ల ఇప్పటికే ఎంతోమంది తమ జీవితాల్లో సంతోషాన్ని తిరిగి చూస్తున్నారు. ఇప్పటివరకూ కొన్ని కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది. ధర కేవలం రూ. 300. ఈ పుస్తకాన్ని చదివితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. హ్యాపీ‌నెస్‌ను ఎలా ఎంజాయ్ చేయాలి? అసలు అది ఎక్కడినుంచి వస్తుంది? ఏం చేయకూడదు? మిరాకిల్స్ ఎలా జరుగుతాయి? అనే విషయాలు ఇందులో రచయిత ప్రస్తావించారు. చదవడానికి కొంచెం కష్టంగానే ఉన్నా నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది.

Note : This is an advice to improve the quality of life. For better results consult concern experts.

Recent

- Advertisment -spot_img