– ఏసీపీ రమేశ్
ఇదేనిజం, జగదేవపూర్: కొండపోచమ్మ బ్రహ్మోత్సవాలకు భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్టు గజ్వేల్ ఏసీపీ రమేశ్ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి కొండపోచమ్మ ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం కొండపోచమ్మ ఆలయం వద్ద పార్కింగ్ స్థలాలను, ఆలయ పరిసరాలను ఏసీపీ రమేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ రమేశ్.. మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెల 22 నుంచి ప్రారంభించబోతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజులు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జానకిరాం రెడ్డి, ఎస్సై చంద్రమోహన్, సర్పంచ్ రజిత రమేశ్, కార్యదర్శి ప్రశాంత్, ఈవో మోహన్ రెడ్డి, సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, హరి, చిన్నా, లక్ష్మణ్, సుధాకర్, చందు తదితరులు పాల్గొన్నారు.