Homeహైదరాబాద్latest Newsఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..

– నలుగురు మావోయిస్టులు మృతి

ఇదే నిజం, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావో యిస్టులు తారసపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతాబలగాలకు, మావో యిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టు మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలం వద్ద మందుపాతరలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img