HomeSocial Mediaబంపర్ ఆఫర్.. ఇజ్రాయెల్ లో లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.1.37లక్షలు..

బంపర్ ఆఫర్.. ఇజ్రాయెల్ లో లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.1.37లక్షలు..

నిర్మాణ రంగంలో ఇజ్రాయెల్ దేశం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. కొన్ని నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ తీవ్రవాదులే లక్ష్యంగా యుద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల పాలస్తీనా ఉద్యోగులను ఇజ్రాయెల్ తీసేసింది. వారి ప్లేస్ లో దాదాపు లక్షమంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుంది. దీనిలో భాగంగా 15మందితో కూడిన బృందం ఇండియాకు వచ్చింది. నిర్మాణ రంగంలో ఉద్యోగులను నియమించేందుకు హర్యానాలో జనవరి 20 వరకు డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మేస్త్రీ, టైల్స్, కార్పెంటర్ మొదలగు నిర్మాణ రంగంలో పని చేసేందుకు నెలకు రూ.1.37 లక్షల జీతం ఇవ్వనుంది. అంతే గాక, రూ.16,515 బోనస్ కూడా ఇస్తారట. ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ నియామక ప్రక్రియ లేదు.

Recent

- Advertisment -spot_img