Homeజిల్లా వార్తలుప్రజాపాలనకు భారీగా స్పందన..

ప్రజాపాలనకు భారీగా స్పందన..

ఇదే నిజం, హుస్నాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రజా పాలన ఐదు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు. శుక్రవారం గుబ్బడి, జనగాం, అంతక పేట, చౌటపల్లి గ్రామాలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ఫైరవీలను నమ్మకుండా డైరెక్ట్ గా గ్రామపంచాయతీ వద్ద మీకు ఏ పథకం కావాలో దానికి అర్జీ పెట్టుకోవాలని తెలియజేశారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఈ ఆరు గ్యారెంటీలు వర్తిస్తాయని హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దాము, సింగిల్ విండో వైస్ చెర్మన్ ఎగిడి ఐలయ్య, డైరెక్టర్ బండి కుమార్, గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, అక్కన్నపేట సర్పంచ్ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, మేక రమేష్, వల్లపు పరశురాం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img