Homeహైదరాబాద్latest Newsఇన్ఫోసిస్‌కు భారీగా ట్యాక్స్ రిఫండ్స్

ఇన్ఫోసిస్‌కు భారీగా ట్యాక్స్ రిఫండ్స్

టెక్ దిగ్గజం, దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ఎక్స్‌పోర్టర్ ఇన్ఫోసిస్‌కు భారీగా ట్యాక్స్ రిఫండ్ లభించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ ఆర్డర్స్ ప్రకారం గత 11 అసెస్మెంట్ ఇయర్స్ కి సంబంధించి రూ. 6,329 కోట్ల విండ్ ఫాల్ గెయిన్స్ అందాయి. 2023- 24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ రిఫండ్స్ లభించినట్లు కంపెనీ తెలిపింది. ఈ రిఫండ్స్ లో వడ్డీ సహా రిఫండ్ నగదు ఉన్నట్లు తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ చెల్లించిన ట్యాక్స్ రిఫండ్స్.. 2007- 08 ఆర్థిక సంవత్సరం నుంచి 2018- 19 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్నాయి.

11 ఏళ్లకు సంబంధించిన ట్యాక్స్ రిఫండ్ చేసినట్లు తమ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది ఇన్ఫోసిస్. పాత ట్యాక్స్ రిఫండ్స్ చెల్లించిన ఆదాయపు పన్ను శాఖ అంతలోనే ఇన్ఫోసిస్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. అసెస్మెంట్ ఇయర్ 2022- 23 కి సంబంధించి రూ. 2,763 కోట్లు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు పంపించింది. అంటే ఆ ఏడాదికి సంబంధించి ఇంకా రూ.2,763 కోట్లు ట్యాక్స్ బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఇన్ఫోసిస్ తెలిపింది. ‘ మార్చి 31 2024 తో ముగిసే త్రైమాసికం, సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదికలపై ఈ ఆర్డర్ల చిక్కులను లెక్కించే ప్రక్రియలో కంపెనీ ఉంది’ అని ఇన్ఫోసిస్ పేర్కొంది.

మరోవైపు అసెస్మెంట్ ఇయర్ 2011- 12 కు సంబంధించి రూ. 4 కోట్ల ట్యాక్స్ బకాయిలు ఉన్నట్లు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థలకు అందినట్లు తెలుస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం లో కంపెనీ ఏకీకృత ఆదాయ పన్ను ఖర్చులు రూ.9,214 కోట్లుగా చూపించింది. అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో ఇది రూ.7,964 కోట్లుగా ఉంది. అలాగే ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థలకు అసెస్మెంట్ ఇయర్ 2021-22, 2018-19 కి సంబంధించి రూ. 145 కోట్లు, 2022-23 కి సంబంధించి రూ. 127 కోట్లు, 2022- 23 కి సంబంధించి రూ. 5 కోట్లు ట్యాక్స్ బకాయిలు ఉన్నట్లు వేరు వేరుగా ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందినట్లు సమాచారం. అందులో ఓ కంపెనీకి అసెస్మెంట్ ఇయర్స్ 2007- 08, 2008- 09, 2016- 17 కి సంబంధించి రూ. 4 కోట్ల రిఫండ్ అమౌంట్ వచ్చినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img