Homeఫ్లాష్ ఫ్లాష్Human Challenge : వైర‌స్ ఎక్కించి.. వ్యాక్సిన్ త‌యారు చేస్తార‌ట‌

Human Challenge : వైర‌స్ ఎక్కించి.. వ్యాక్సిన్ త‌యారు చేస్తార‌ట‌

లండన్‌: ‘హ్యూమన్‌ ఛాలెంజ్‌ అధ్యయనం’గా పిలిచే ఈ పరిశోధనలో వ్యాక్సిన్‌ పనితీరును పరీక్షించడానికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి వైరస్‌ను ఎక్కించి ప్రయోగాలు చేస్తారు.

ఇలా ప్రయోగాల కోసం ఆరోగ్య‌వంతుల‌ను వైరస్‌ బారిపడేలా చేయడం ప్రమాదకరం, అనైతికమన్న కారణాలతో ఈ విధానం వివాదాస్పదమైంది.

గతంలో టైఫాయిడ్, కలరా, మలేరియా తదితర వ్యాధులకు వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో ఈ విధానాన్ని అనుసరించారు.

కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఈ విధానంలో ప్రయోగాలు జరపబోతున్న తొలి దేశంగా బ్రిటన్‌ నిలవనుంది.

కరోనాకు అత్యంత వేగంగా సమర్థమైన, సురక్షితమైన టీకాను అభివృద్ధి చేయాలంటే హ్యూమన్‌ ఛాలెంజ్‌ అత్యవసరమని బ్రిటన్‌ పరిశోధకులు భావిస్తున్నారు.

లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన పరిశోధకుల బృందం ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలను నిర్వహించనున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

జనవరిలో ఈ ప్రయోగాన్ని మొదలు పెడతారు. అంతకు ముందుగా ఎథిక్స్‌ కమిటీ దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img